ఇద్దరు చిన్నారులను బలిగొన్న రోడ్డు ప్రమాదం..ఆ కుటుంబానికి తీరని వ్యథ

A road accident that killed two children is a great tragedy for the family

0
94

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను తీసుకుని బైక్​పై బయలుదేరాడు. తండ్రితో బయటకు వెళ్తున్నామని చిన్నారులు కూడా సంతోషంతో ఉన్నారు.

సజావుగా వెళ్తున్న వారిని మృత్యువు గేదే రూపంలో అడ్డుకుంది. తండ్రి జాగ్రత్తగా బైక్​ను నడుపుతుండగా ఓ గేదే అడ్డు వచ్చింది. దీంతో అతను సడెన్ బ్రేక్ వేయగా బైక్​ అదుపు తప్పి బోల్తా పడింది.  ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రికి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. స్థానికులు క్షత్రగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.