జంట నగరాల్లో దొంగల హల్ చల్..గంట వ్యవధిలో వరుస చైన్ స్నాచింగ్ లు

A series of chain snatchings in a matter of hours

0
103

తెలంగాణ: జంట నగరాలు అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సికింద్రాబాదులో రెండు చైన్ స్నాచింగ్ లు, నార్త్ జోన్ లో వరుస చైన్ స్నాచింగ్ లు జరిగాయి. అయితే ఇవన్నీ చేసింది ఒక్కరేనా లేక వేరేవాళ్ల అనేది తెలియాల్సి ఉంది.

మారేడ్ పల్లి, తుకరం గెట్ లో బైక్ పై వచ్చి స్నాచింగ్ కు పాల్పడ్డాడు ఓ యువకుడు. హైదరాబాద్, సైబరాబాద్ లో స్నాచింగ్ లకు పాల్పడింది ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నాలుగు చైన్ స్నాచింగ్ లు ఒక్క గంట వ్యవధిలో జరగడం ఈ అనుమానాలకు తావిస్తోంది.

పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో గంట వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడలో నుంచి గొలుసు దొంగతనాలకు యత్నించి రెండు చోరీలు చేశారు దుండగులు.

రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడలోనుంచి రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు.

జీడిమెట్ల గ్రామంలో వరలక్ష్మి అనే మహిళ మెడలోనుంచి 4 బంగారు తులాల గొలుసు చోరీ జరిగింది.

భాగ్యలక్ష్మి కాలనీ ఉమారని అనే మహిళ మెడలోనుంచి గోలుసును లాక్కెళ్లేందుకు యత్నించగా కేకలు వేయడంతో వదిలేసి దుండగుడు పరారయ్యాడు. ఈ మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. సీసీటివిలను పరిశీలిస్తున్నారు.