జమ్మూకాశ్మీర్ లో వరుస పేలుళ్ల కలకలం

0
153

జమ్మూకాశ్మీర్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఉధంపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో ఉన్న బస్సులో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే మరో బస్సులో పేలుడు సంభవించింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.