ఓ పక్క వరద – చెక్కల వంతెన పై ట్రక్కు – చివరకు ఈ ట్రక్కు ఏమైందో చూడండి

A side flood - a truck on a wooden bridge

0
126

అనేక ప్రాంతాల్లో ఇప్పటీకీ సరైన కాంక్రీట్ వంతెనలు లేక కాలిబాట చెక్కల వంతెనలు వాడుకుంటున్నారు ప్రజలు. కాంక్రీట్ వంతెనలు నిర్మించాలి అని కోరుతున్న విలేజ్ లు చాలా ఉన్నాయి. ఇక వాటిపై ఏదైనా వాహనాలు వెళ్లినా, ఏదైనా వరదలు నీటి ప్రవాహాలు వచ్చినా ఆ వంతెనలు కూడా కూలిపోవడం చూశాం. ఇక వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు.

తూర్పు రష్యాలోని ఓ నదికి వరదలు సంభవించాయి. ఈ సమయంలో నది నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఓ వ్యక్తి చెక్కల వంతెనపైకి ట్రక్కుతో వచ్చాడు. అయితే ఒక్కసారిగా అది కుప్పకూలింది. ఆ ప్రవాహంలో ఆ ట్రక్కు కొట్టుకుపోయింది.

గత వరదలలో కాంక్రీట్ వంతెన కొట్టుకుపోగా ప్రస్తుతం ఈ వంతెనను తయారు చేశారు. మాస్కోకు తూర్పున 3700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరియం గ్రామంలో జరిగింది ఈ ప్రమాదం. ఇక డ్రైవర్ నదిలో ఈదుకుంటు బయటపడ్డాడు. ట్రక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. ఈ వంతెన మీద నుంచి గ్రామస్తులు రాకపోకలు ఉంటాయి ఇది లేకపోవడంతో అందరూ ఇబ్బంది పడ్డారు.

https://twitter.com/i/status/1418628677936455681