Bachupally | వామ్మో.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. రెండో అంతస్థు నుంచి దూకి పరారీ..

-

Bachupally | హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడి తలుపులు వేయడంతో ఇంట్లో ఉన్న మహిళ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. అయితే వెంటనే తేరుకుని తలుపులు తీసి గట్టిగా అరుస్తూ వీడియో తీసింది. దీంతో ‘బయట నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు మేడమ్‌.. మీ కాళ్లు మొక్కుతా అరవొద్దు..’ అంటూ వారించాడు. ‘నువ్వు ఎవరు? నీ పేరేంటి’ అంటూ ప్రశ్నించడంతో రెండో అంతస్థు నుంచి కిందకు దూకి పారిపోయాడు.

- Advertisement -

Bachupally | ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అతను ఎవరు..? ఎందుకు ఇంట్లో చొరబడ్డాడు..? దొంగనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...