ఘోర అగ్నిప్రమాదం..10 మంది సజీవదహనం?

0
97

తెలంగాణ: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని హెండీస్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా..10 మందికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం.

కాగా అనధికారికంగా 10 మంది మరణించారని సమాచారం అందుతుంది. అయితే మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు తీవ్రంగా గాయపడ్డ వారికి చికిత్స అందించడంతో పాటు రూ.కోటి నష్ట పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపింది. ఇప్పటికైనా కంపెనీలకు వత్తాసు పలికే వారు మారాలని హెచ్చరిస్తూ.వెంటనే గ్రామంలో ఉన్న కంపెనీలను మూసి వేయాలని డిమాండ్ చేశారు.