ఫ్లాష్: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం..

0
94
Kabul

ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో ఏకంగా 50 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం యూనిట్‌ 4 లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయిన్నట్టు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో పాటు 13 మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలిపారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.