తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడపడం, రూల్స్ పాటించక పోవడం వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
పూడురు సమీపంలోని స్టీల్‌ఫ్యాక్టరీ వద్ద లారీని వెనకనుంచి కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించగా..మృతులు జహిరాబీ, జావెద్, ఉమర్ గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.