ఘోరం- బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ తో సహా మరో వ్యక్తి అత్యాచారం

0
87

ఎన్ని శిక్షలు వేసిన, కఠిన చట్టాలు తెచ్చిన కామాంధుల అఘాయిత్యాలకు ఆగడం లేదు. వీరి పైశాచికత్వానికి ముక్కుపచ్చలారని చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. నిర్భయ తరహా ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మధ్యప్రదేశ్ కుక్షి నుంచి మనవర్ కు బస్సు వెళ్తుండగా అందులో మహిళ ఎక్కింది. బాధితురాలు లాంగ్సారిలో దిగాల్సి ఉండగా  బస్సును ఆపలేదు. అయితే తరువాత వచ్చే స్టేజీలో మహిళనను దింపేస్తామని డ్రైవర్, కండక్టర్ నమ్మబలికారు. అయితే ఆ స్టేజీ వచ్చే వరకు బస్సులో ప్రయాణికులు అంతా ఖాళీ అయ్యారు. వక్రబుద్ధితో ఆ మహిళపై డ్రైవర్, కండక్టర్, మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.