తల్లితండ్రుల దగ్గర ఉంటే కచ్చితంగా మనకు క్షేమం అని ఏ పిల్లలు అయినా అనుకుంటారు. అన్నయ్య దగ్గర ఉన్నా నాకు క్షేమం అని చాలా మంది చెల్లెల్లు భావిస్తారు. కాని కొందరు మానవమృగాలు సొంత కూతురిపై, సొంత చెల్లెలపై కూడా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడి చేస్తున్నారు. వారి వరసలు లేకుండా కన్నకూతురిపై కూడా దారుణంగా ప్రవర్తించిన దుర్మార్గులు ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని షిహోర్ పట్టణంలో ఓ యువతి పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అసలు దీనికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే కన్నీరు పెట్టుకుంటూ తన తండ్రి చేసిన నీచమైన పని చెప్పింది.
ఏడాది కాలంగా తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడినట్టుగా చెప్పింది. తల్లి పడుకున్న సమయంలో, పనికి వెళ్లిన సమయంలో కూతురిపై ఇలా దారుణానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.