షాకింగ్… అమెజాన్ లో కత్తి కొని.. అర్థరాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లి…

0
101

ఒక యువకుడు అమెజాన్ లో 1500 రూపాయలు వెచ్చించి పదునైన కత్తి (జాబియా) కొనుగోలు చేశాడు. అర్థరాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు… తర్వాత ఏం జరిగిందంటే? హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సిఐ రాజశేఖరరెడ్డి, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి.

బోరబండ సమీపంలోని బంజారానగర్ లో నివశించే బండారి శ్రీకాంత్ (25) దాదాపుగా నాలుగేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్ ఎస్ఎస్ బి నగర్ లో ఉండేవాడు. ఒక స్టార్ హోటల్ జిమ్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న 23 ఏళ్ల యువతితో అప్పుడు పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. అంతేకాదు 2020 అక్టోబరు లో శ్రీకాంత్ మీద ఆ యువతి కేసు పెట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ అయింది. అయితే తనతో మాట్లాడాలంటూ మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు సదరు యువతికి ఫోన్ చేశాడు. ఆ యువతి అతని మీద అనుమానంగానే సరే అని ఒప్పుకుంది. దీంతో శ్రీకాంత్ ఆమె ఉండే ఇంటికి రాత్రి వెళ్లాడు.

ఆ ఇంట్లో యువతితోపాటు ఆమె సోదరి ఉన్నారు. ఇంట్లో ఇద్దరూ కూర్చుని మాట్లాడుతుండగా అతని వెనుక వీపు భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది. వెంటనే తన ఆ యువతిని పిలిచి అతడు కత్తి తీసుకుని వచ్చాడని, వెంటనే వేరే గదిలోకి తలుపు పెట్టుకోవాలని సూచించింది. వెంటనే ఆమె వేరే గదిలోకి వెళ్లి డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చేరవేసింది.

అదే సమయంలో యువతి సోదరి శ్రీకాంత్ ను మాటల్లో పెట్టింది. సమాచారం అందుకున్న జూబ్లిహిల్స్ కార్ 2 సిబ్బంది సందీప్ తదితరులు వెంటనే యువతి ఇంటికి చేరుకున్నారు. శ్రీకాంత్ ను తనిఖీ చేయగా జాంబియా కత్తి ఆయన వద్ద కనిపించింది. యువకుడిని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే తన సోదరుడి జన్మదిన వేడుకల కోసం కత్తిని కొనుగోలు చేసినట్లు శ్రీకాంత్ పోలీసులకు వెళ్లడించాడు. అతడు నిజంగానే సోదరుడి జన్మ దిన వేడుకలకోసమే కత్తిని కొనుగోలు చేశాడా? లేదంటే యువతిపై దాడి చేయడానికి తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బర్త్ డే కోసమే అయినా అమెజాన్ లో 1500 రూపాయలు వెచ్చించి కత్తిని కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. శ్రీకాంత్ ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కంప్టెంట్ చేసిన నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నందుకు యువతి కుటుంబం వారికి ధన్యవాదాలు తెలిపారు.