జిమ్ లో అప్పటి వరకూ ఎక్సర్ సైజ్ చేశాడు బయటకు వచ్చి కుప్పకూలిన యువకుడు – వీడియో వైరల్

A young man who came out of the gym to exercise and collapsed

0
101

ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. అప్పటి వరకూ మనతో ఉన్న వ్యక్తి ఏదైనా జరిగి మన నుంచి దూరం అవ్వచ్చు.. చావు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. చిన్న వయసులో ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు కూడా చనిపోవడం అనేది చూస్తు ఉంటాం. ఇలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటి వరకు బాగానే ఉన్న ఓ 33 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు అసలు ఏమైందంటే.

సూరత్ గోల్డ్ జిమ్ లో 33 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తుంటాడు. ప్రతి రోజులాగానే వ్యాయామం చేశాడు. అలా గుండె దగ్గర నొప్పిగా ఉంది అని జిమ్ బయటకు వచ్చి మెట్ల పై కూర్చున్నాడు. వాటర్ తాగాడు అతను అలాగే రెండు నిమిషాల వరకూ అక్కడే ఉన్నాడు. గుండెపై చేయి వేసుకున్న అతను అమాంతం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ వీడియో పెను వైరల్ అవుతోంది.

గుండె ఆగిపోవడం వల్లే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఇదంతా జిమ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
అతని కుటుంబం కన్నీరు మున్నీరు అయింది. జిమ్ సన్నిహితులు కూడా అతను చాలా మంది వ్యక్తి అని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ వీడియో
https://www.instagram.com/tv/CTRrigZl6Or/?utm_source=ig_embed&ig_rid=f9cef591-d402-4dfe-af7a-39eef9bf390c