నడిరోడ్డుపై కత్తితో యువకుడి వీరంగం

A young man with a knife on the sidewalk

0
77

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మధ్యం మత్తులో యువకుడి వీరంగం కలకలం రేపింది. పట్టణంలో ఓ వైన్ షాప్ లో మద్యం సేవించి కొందరు ఘర్షణ పడ్డారు. అయితే ఈ ఘటనలో వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామానికి చెందిన మిరియాల సురేష్ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా  మద్యం మత్తులో కత్తి పట్టుకుని మెయిన్ రోడ్డు పై వీరంగం చేసాడు. కనబడిన వారిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసాడు. దీనితో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.