ఒకే గ్రామంలో గంట వ్యవధిలో యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో జరిగిందీ ఘటన. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకోగా..యువకుడు పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీళ్లిద్దరి మధ్య కొన్నిరోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.