ఒంటిపై బట్టలు లేకుండా యువతి..90 శాతం కాలిన గాయాలు..ఎన్నో అనుమానాలు

A young woman without clothes on her neck .. with 90% burns ..

0
82

హైదరాబాద్ శివారులో ఓ యవతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలోని నిర్మానుష ప్రదేశంలో కవిత అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకుంది. అయితే, యవతి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తానే స్వయంగా నిప్పంటించుకుందా? లేక హత్య యత్నం జరిగిందా అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సన్ సిటీ ప్రాంతానికి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చెట్ల పొదల్లోకి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండడం పక్కనే కిరోసిన్ బాటిల్‌తో పాటు మద్యం ఉండడం హత్యాయత్నంపై పలు అనుమానాలకు దారితీశాయి. మరోవైపు దాదాపుగా 90% కాలిన గాయాలతో ఉన్న మహిళని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.