10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

0
167

పోలీసుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండాపోతున్నది. బక్కోడా, బలిసినోడా అని చూడకుండా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర లంచాలు పిండుతున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ ఎస్సై 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి అడ్డంగా దొరికిపోయాడు.

ఒక కేసు విషయంలో బాధితుల నుంచి 10వేలు లంచం తీసుకుంటూ మియాపూర్ ఎస్సై యాదయ్య దొరికిపోయారు. అనంతరం మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఎసిబి అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.