డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్ట్రార్

0
69

అవినీతి చేయడంలో కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఆరితేరిపోయారు. కొత్త కొత్త పద్ధతుల్లో అవినీతి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

ఒక వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్. దీంతో సదరు వెంచర్ నిర్వాహకులు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోదక శాఖ అధికారులు.

డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గురువారం ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన సోదాలు పట్టణంలో కలకలం రేపాయి. ఉదయమే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు తలుపులు వేసి మరీ ఎసిబి అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారు. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.