Flash- పండగ పూట ప్రమాదం..20 మందికి గాయాలు

Accident during festival..20 injured

0
83

తెలంగాణ: అందరూ పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి బయలుదేరారు. తమ వారిని కలుసుకుంటామనే ఆనందంలో నిద్రకు ఉపక్రమించారు. కానీ ప్రమాదం జరిగుతుందని వారు ఎవరూ ఊహించలేదు. ప్రాణనష్టం జరగకపోయినా…ప్రాణం పోతుందనే భయం తమను వెంటాడిందని వారు వాపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్​ నుంచి కర్నూల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. 20 మందికి గాయలయ్యాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని వారు ఆరోపించారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.