Flash: పెళ్లింట తీవ్ర విషాదం నింపిన ప్రమాదం.. ఐదుగురు మృతి

0
85

వరంగల్ జిల్లాల్లోని ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఇంకొన్ని రోజుల్లో తన కూతురు పెళ్లి అంగరంగవైభవంగా చేద్దామని నిర్ణయించుకున్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెండ్లితో సందడిగా ఉండవలసిన ఆ ఇంట్లో మృత్యువు తీరని విషాదాన్ని నింపింది. ఈ నెల 24 వివాహం జరగాల్సి ఉండగా పెండ్లి సామాన్ కోసం పెళ్లి కూతురు పెద్దనాన్న పెద్దమ్మ, మేనత్త, మెనమామ, వదిన ట్రాక్టర్లో వెళ్లారు.

ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి పెళ్లికూతురు బంధువులు ఐదుగురు మృతి చెందడంతో పాటు..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన పడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతిచెందిన వారిని గుగులోతు సీతమ్మ,జాట్టోతు బిచ్య,గుగులోత్ స్వామి,గోవింద్, గూగులోతు శాంతమ్మగా పోలీసులు గుర్తించారు.