ప్రియమణి పెళ్లి చెల్లదు – ముస్తఫారాజ్ మొదటి భార్య

Actress Priyamani marriage is not valid

0
184

ప్రియమణి ముస్తఫారాజ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహం చెల్లదు అని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా కొద్దిరోజులుగా వాదిస్తోంది. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని, తనతో విడాకులు తీసుకోలేదని ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు ముస్తఫారాజ్.

ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ముస్తఫారాజ్ దగ్గరే ఉంటున్నారు. వారి బాధ్యత ముస్తఫా చూసుకుంటున్నాడు. ఈ సమయంలో 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తఫా.

అయితే ఈ విషయంపై ప్రియమణి మాట్లాడారు.మాది చట్ట విరుద్ధ సంబంధం కాదు. మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. ముస్తఫా భర్తగా దొరకడం నా అదృష్టం. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. రోజూ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం అని చెప్పారు. మేం చాలా బాగున్నాం అని ప్రియమణి తెలిపారు.