Breaking News – శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్ – కార‌ణం ఈ సినిమాలే

Actress Shilpa Shetty husband Raj Kundra arrested

0
133

బాలీవుడ్ లో ఒక్క‌సారిగా ఈ వార్త అంద‌రిని షాక్ కి గురి చేసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి కార‌ణం ఏమంటున్నారంటే? పోర్న్‌ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్‌ యాప్స్‌ ద్వారా ప్రసారం చేస్తున్నార్న ఆరోపణలతో రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే వీటికి సంబంధించి పోలీసుల ద‌గ్గ‌ర కీల‌క ఆధారాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఆయ‌న నుంచి పూర్తి ఆధారాలు సేక‌రించ‌డానికి రాజ్ కుంద్రాని అదుపులోకి తీసుకున్నార‌ని తెలుస్తోంది. పోర్న్‌ వీడియోలను యాప్‌లో విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై రాజ్‌ కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు.

ఈ కేసులో రాజ్ కుంద్రా ప్ర‌ధాన పాత్ర పోషించార‌ని porn త‌మ ద‌గ్గ‌ర పూర్తి ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపారు పోలీసులు.మొబైల్‌ యాప్‌లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్‌ కుంద్రా నిర్మాతగా వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మ‌రి చూడాలి పూర్తి వివ‌రాలు వ‌చ్చేవ‌ర‌కూ