ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో..మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా తెలంగాణ మద్యాన్ని కొంత మంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గత ఆదివారం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రవణ్‌కుమార్ అనే కానిస్టేబుల్..పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మద్యం కాటన్లను తరలిస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్సై విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.