అమానుషం..విద్యార్థిని చితక్కొట్టిన సినిమా హాల్ సిబ్బంది..చికిత్స పొందుతూ మృతి

Amanusham..cinema hall staff who crushed the student.. died while receiving treatment

0
105

ఓ విద్యార్థిపై సినిమా హాలు సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. ప్రైమరీ స్కూల్ పిల్లాడు అని చూడకుండా తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పిల్లవాడిని కాకినాడ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ అమానుష ఘటన ఏపీలోని చింతూరులో జరిగింది.

వివరాల్లోకి వెళితే..చింతూరు ప్రైమరీ స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్న విష్ణు సినిమా హాల్లోకి టికెట్ లేకుండా ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న సినిమా హాల్ సిబ్బంది విష్ణును తీవ్రంగా కొట్టి తలకిందులుగా వేలాడదీసి నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. విష్ణు గుండెల మీద బాగా కొట్టారని ,దాడి అనంతరం ఫంక్షన్ కి వెళ్ళిన విష్ణు భోజనం చేసి ఇంటికి రాగా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతడిని హుటాహుటిన చింతూరు ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం అనంతరం కాకినాడ ఆసుపత్రులకు తరలించారు.

కాకినాడలో చికిత్స చేస్తుండగానే మంగళవారం రాత్రి విష్ణు మరణించినట్లు తెలిసింది చిన్నపిల్లల చేష్టలను గమనంలోకి తీసుకోకుండా నేరంగా భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దారుణంగా కొట్టి హింసించారు. విద్యార్థి బలి తీసుకున్న చింతూరు నవయుగ సినిమా హాలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. చర్యల కోసం విద్యాశాఖ అధికారులు బాలల హక్కుల సంఘం వారు వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలి. అలాగే సినిమా హాల్ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టి విద్యార్థి విష్ణు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు,విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.