తెలంగాణలో కలకలం..4 వేల కోళ్లు మృత్యువాత

An elusive disease in Telangana

0
95

తెలంగాణలో మరోసారి అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. నెక్కొండ మండలం హరిశచంద్రు తండాలో 4 వేల కోళ్లు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మురళి నాయక్ అనే వ్యక్తి సరిత పౌల్ట్రీ ఫామ్ లో గత కొద్దిరోజులుగా కోళ్లను పెంచుతున్నాడు. మొత్తం తన ఫామ్ లో 11 వేల కోళ్లు ఉన్నాయి. కానీ కొద్దిరోజుల నుండి రోజుకు వెయ్యి చొప్పున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే సోమవారం ఒక్కసారిగా 4 వేల కోళ్లు చనిపోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది.