ఎన్​సీబీ విచారణకు అనన్యా పాండే డుమ్మా..కారణం ఏంటో?

Ananya Pandey Dumma for NCB trial

0
114

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో బాలీవుడ్‌ నటి అనన్యా పాండే పేరు రావడం వల్ల ఎన్‌సీబీ అధికారులు ఆమెకు ఇటీవలే సమన్లు జారీ చేశారు. గత వారంలో రెండు సార్లు ఆమెను ప్రశ్నించిన అధికారులు సోమవారం (అక్టోబర్​ 25) మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు రావాలని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల అనన్య విచారణకు హాజరుకాలేదని సమాచారం.

మరోవైపు ఆర్యన్ కేసునువాదిస్తున్న లాయర్‌ సతీన్‌ మనెషిండేను షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ సోమవారం కలిశారు. ఈ ఉదయం గౌరీ మన్నత్‌ నుంచి బయల్దేరగా..ఆమె జైల్లో ఉన్న తనయుడు ఆర్యన్‌ను కలిసేందుకు వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆమె న్యాయవాదిని కలిసి కేసు పురోగతి గురించి చర్చించినట్లు సమాచారం.

ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ బాంబే హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే మూడు సార్లు ఆర్యన్‌..బెయిల్‌ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగానే కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడగానే ఆర్యన్‌ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు అక్టోబరు 26న విచారణ చేపట్టనుంది.