భార్య పై కోపంతో చివరకు ఎంత దారుణం చేశాడంటే

Anger on the wife is how cruel he was in the end

0
118

ఉత్తరాఖండ్ లో దారుణం జరిగింది. తన భార్యను నైనిటాల్ కి తీసుకువెళ్లి ఆమెను ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి తోసివేశాడు భర్త .ఢిల్లీలో సేల్స్ మన్ ఉద్యోగం చేస్తున్న ఇతను స్నేహితురాలైన బబిత అనే యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. చివరకు పెళ్లి చేసుకోకుండా ఆమెని వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది.

చివరకు బబితను వివాహమాడతానని చెప్పి కేసు వెనక్కి తీసుకునేలా చేశాడు. చివరకు వివాహం చేసుకున్నాడు అయితే ఆనాటి నుంచి రోజూ వేధింపులే .నీ వల్ల నేను జైలుకి వెళ్లా అని టార్చర్ పెట్టేవాడు. చివరకు గత జూన్ 21 న తమ కుమార్తె కనబడకుండా పోయిందని పోలీసులకి ఆమె పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు.

ఆమె ఫోన్ స్విచాఫ్ అయి ఉందని వారు తెలిపారు. దీంతో పోలీసులు విచారణ చేశారు. నైనిటాల్ తీసుకువెళ్లి కొండ ప్రాంతం నుంచి తోసివేశానని భర్త పోలీసుల విచారణలో నిజం చెప్పాడు. దీంతో అతన్ని పోలీసులు జైలుకి పంపారు.