కోడికూర వండలేదని..చెల్లిని వెంటాడి వేటాడి చంపిన అన్న..

0
91

దేశంలో రోజురోజుకు దారుణాలు విపరీతంగాపెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు ఇలా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఏకంగా సొంతవారిపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కోడి కూర వండ లేదని సొంత చెల్లిని హతమార్చాడు ఓ దుర్మార్గపు అన్న. తూర్పుగోదావరి జిల్లా కన్నా పురానికి చెందిన కొవ్వాసి నంద అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. నంద గురువారం రాత్రి 10 గంటల సమయంలో కోడిమాంసం ఇంటికి తీసుకు వచ్చాడు. కోడి కూర చేయమనగా తనకు నీరసంగా ఉందని సోమమ్మ చెప్పింది. మద్యం మత్తులో ఉన్న అన్న ఆగ్రహానికి గురై చెల్లెల్ని వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నందను అరెస్టు చేశారు.