రాజ్ కుంద్రా పై మరో నటి ఫిర్యాదు – ఆమె ఏం చెబుతోందంటే

Another actress complains about Raj Kundra

0
117

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకి సంబంధించి మరో బాధితురాలు వచ్చింది. ఇప్పటికే అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యారు రాజ్ కుంద్రా. తాజాగా మరో నటి అత‌ని పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమె అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ లో రాజ్ కుంద్రా విడుదల చేశారని ఆమె తెలిపింది.

మల్వాణీ పోలీస్ స్టేష‌న్ లో రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేసింది. ఈ వీడియోల విషయంలో రాజ్ కుంద్రా తనని మోసం చేశాడని తెలిపింది. ముందు రాజ్ కుంద్రాతో ఒప్పందం చేసుకుని వీడియోలో నటించాను. అయితే ఆ ఒప్పందం ప్రకారం.తన ప్రైవేట్ పార్ట్స్ వీడియోలో చూపించకూడదనే షరతు పెట్టాను. ముందు ఒకే అన్నారు కాని ఆ వీడియోలో రాజ్ కుంద్రా మాత్రం మార్పులు చేయకుండా, పూర్తి వీడియోని యాప్ లో విడుదల చేశారని తెలిపింది.

ఆ విధంగా విడుదల చేయవద్దు అని ఒప్పందం చేసుకున్నా అతను విడుదల చేశాడని, ఈ విషయం తన స్నేహితుడు తెలిపాడని చెప్పింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.