హైదరాబాద్ లో మరో దారుణం..

0
103

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే ఓ అడ్డా కూలీ జీవితాన్ని అంధకారం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ రోజు కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. రోజులాగే బుధవారం ఉదయం శంషాబాద్‌ లోని అడ్డా దగ్గర నిలబడి పనికోసం ఎదురుచూస్తుండగా..గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను బైక్ పై ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు.

అనంతరం ఇద్దరు దుండగులు మహిళపై అత్యాచారానికి పాల్పడి..ఆ తరువాత బండరాయితో తలపై కొట్టి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. ఈ మహిళను గమనించిన కొందరు స్థానికులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలియజేసారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.