హైదరాబాద్ లో మరో దారుణం..బాలిక‌పై గ్యాంగ్ రేప్

0
110

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

కార్ఖానాకు చెందిన ఓ బాలిక‌పై ఐదుగురు యువ‌కులు సామూహిక లైంగిక‌దాడికి పాల్పడిన ఘటన  హైద‌రాబాద్ న‌గ‌రంలో  చోటుచేసుకుంది. ధీర‌జ్, రితేశ్ అనే ఇద్ద‌రు యువ‌కులు మొదటగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలిక‌ను ప‌రిచ‌యం అయ్యి  మంచి అభిప్రాయం ఏర్ప‌డేలా చాటింగ్ చేసి ఆ బాలిక అసభ్యకరమైన వీడియోలు తీశారు.

ఆ వీడియోల‌ను అడ్డుగా పెట్టుకుని ఇద్దరు యువకులతో పాటు..త‌న స్నేహితుల‌తో క‌లిసి సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. దాంతో తల్లితండ్రులు తమ కూతురి మానసికపరిస్థితి గమనించి నిలదీయగా అసలు నిజం చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు మే 30వ తేదీన పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు న‌లుగురి నిందితులను రిమాండ్‌కు త‌ర‌లించారు.