పోలీసుల వేధింపులకు మరో కుటుంబం ఆత్మహత్య..

0
72

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వేధింపుల కారణంగా ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నవారు చాలానే మంది ఉండగా..తాజాగా దీని కారణంగానే ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కలచివేస్తుంది. లేని నేరాలను తమపై మోపి  దారుణంగా హింసించడంతో అవమానానికి తట్టుకోలేక ఈ ఆత్మహత్యలకు పాల్పడట్టు సమాచారం తెలుస్తుంది.

బిసి కమ్యూనిటీకి చెందిన మెహక్‌ సింగ్‌, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారునితో కలిసి భాగ్‌పట్‌లోని బచోద్‌ గ్రామంలో తీవ్ర పేదరికంలో ఉన్న కూడా తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా నివసిస్తున్న క్రమంలో మెహక్‌ కుమారుడు, అదే గ్రామానికి చెందిన దళిత యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత రెండు రోజులుగా ఆ యువతీ కనిపించపోవడంతో పోలీసులు గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో యువతి కుటుంబం  తమ కుమార్తెను మెహక్‌ సింగ్‌ కుటుంబం కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దళిత మహిళ కిడ్నాప్‌కు గురైందంటూ ఈ నెల 24న మెహక్‌ సింగ్‌ నివాసంలో సోదాలు జరిపి తీవ్రంగా వేధించారు.

దాంతో చుట్టుప్రక్కల వాళ్ళ ముందు అవమానంగా భావించి కుటుంబం మొత్తం విషం తాగిన ఘటన అందరిని కలచివేస్తుంది.ఈ ఘటనలో మెహక్‌ సింగ్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడిక్కడే మృతిచెందగా, మెహక్‌ ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య చికిత్స పొందుతూ కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే మెహక్‌ కుమారుని ఆచూకీ  తెలియకపోగా..వారి కుటుంబాన్ని మానవత్వంతో ఆర్థికంగా ఆదుకోవాలని బచోడ్‌ గ్రామ ప్రధాన్‌ విశాల్‌ బర్ధన్‌ మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అంతేకాకుండా ఈ ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు