భర్తతో కలిసి వాకింగ్ చేస్తుండగా..మహిళపై లైంగిక దాడికి యత్నం..కేబీఆర్ పార్క్ లో ఘటన

0
81

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.  శనివారం ఉదయం పూట భర్తతో వాకింగ్ వెళ్లిన ఓ మహిళకు ఇలాంటి ఘటనే ఎదురైంది. వాక్ వేలో నడుస్తున్న సమయంలో ఓ దుండగుడు సదరు మహిళను వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక మహిళను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆమె అరుపులు పెట్టింది. దీనితో చుట్టుపక్కల వారు రాగా దుండగుడు పారిపోయాడు.

ఇప్పటికే నటి షాలు చౌరాసియా పై ఓ ఆగంతకుడు ఇదే పార్క్ లో లైంగిక దాడికి యత్నించాడు. నిర్మానుష్య ప్రాంతంలో పట్టుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తి నుంచి చౌరాసియా తప్పించుకుంది. తాజాగా అలాంటి ఘటన మళ్లీ చోటు చేసుకోవడం బాగానగరంలో కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలతో బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ లో మహిళలకు రక్షణ కరువైందంటూ పలువురు వాపోతున్నారు.