Breaking- తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Another Inter student commits suicide in Telangana

0
95
Suicide

చిన్నపాటి కారణాలతో కొందరు విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో..మార్కులు తక్కువగా వచ్చాయని ఇంట్లో మందలించారనే కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్యాల మండలం చల్లగరిగలో వరుణ్ అనే ఇంటర్ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. దీనితో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.