తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కఠిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో జూబ్లిహిల్స్ రేప్ కేసు ఎంత అలజడి సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో రేప్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చందనగర్ లో మరో రేప్ కేసు ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. 10వ తరగతి చదువుతున్న దళిత బాలిక ట్యూషన్ వెళ్లి వస్తుండగా అరవింద్ అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోలని చూపించి లవ్ చేయాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. దీనితో బాలిక సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దళిత బాలిక అయినా..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. అంతేకాకుండా బాలిక ఇష్టంతోనే అత్యాచారం చేశారని ఎస్.ఐ. శ్రీనివాసులు బాధిత కుటుంబంపై దాడి చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖకే మచ్చతెచ్చేలా వీరి వ్యవహరించారని పలువురు వాపోతున్నారు.
అయితే అన్ని అధారాలు ఉన్నా నిందితుడిని శిక్షించడం లేదని బాధితురాలు అసహనం వ్యక్తం చేసింది. దీని వెనుక టీ.ఆర్.ఎస్. కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బాధిత కుటుంబాన్ని కాంప్రమైజ్ కావాలని, కేసు విత్ డ్రా చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఐ. శ్రీనివాసులు కూడా వారిపై ఒత్తిడి చేసినట్లు, బాలిక తండ్రి పై థర్డ్ డిగ్రి ప్రయోగించినట్లు తెలుస్తుంది.