మరో పరువుహత్య కలకలం..కూతురు, అల్లుడిని నరికిచంపిన తండ్రి

0
70

తమిళనాడులో ఘోరం జరిగింది. రాష్ట్రంలోని తూతుక్కుడికి చెందిన ముతుకుట్టి కూతురు యువకునితో ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఈ విషయం తెలిసింది. అమ్మాయి తండ్రి వారి పెళ్లికి ససేమిరా అన్నాడు. తన కూతురికి దూరంగా వెళ్లిపోమని అబ్బాయికి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

అయితే తాము కలిసే ఉంటామని స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమికులు. పెళ్లి అనంతరం వేరే ఇంట్లో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి కోపంతో ఊగిపోయాడు. తన పరువు తీసిన కూతురు ఉన్నా లేకున్నా ఒకటే అనుకున్నాడు. క్షణికావేశంలో వారి ఇంటికి వెళ్లి కూతురు, అల్లుడిని అక్కడికక్కడే నరికి చంపాడు.