బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ముంబయికి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై కేసు పెట్టినట్లు వెల్లడించారు.
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ప్రారంభించిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51లక్షలు తీసుకున్నారని..అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని సదరు వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు రాజ్‌కుంద్రా..అశ్లీల చిత్రాల కేసులో జైలుకెళ్లారు. ఇటీవలే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.