ఏపీ అతలాకుతలం..బోల్తా పడ్డ బస్సు..ప్రయాణికుల ఆర్తనాదాలు

AP Atalakutalam .. overturned bus .. passengers' cries

0
112

ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు చెక్ పోస్టు వద్ద ప్రధాన రహదారికి సమీపంలో తెగిన చెరువు కట్ట భారీగా నీరు ప్రవహిస్తుంది. ఊహించని పరిణామంతో వరద గుప్పిట రోడ్డుపై వెళ్తున్న మూడు ఆర్టీసీ బస్సులలో ఒకటి నీటి ఉధృతికి బోల్తా పడింది. 30 మంది ఆర్టీసీ ప్రయాణికులను శ్రమించి పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

వెంటనే రంగంలోకి పోలీసు, విపత్తు సహాయక బృందాలు దిగాయి. తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్న రాజంపేట డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి, మన్నూరు ఎస్.ఐ భక్తవత్సలం పోలీసు, అగ్నిమాపక సిబ్బంది..ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గంట పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో తాళ్ల సాయంతో నీటిలోకి దిగి రెండు బస్సులోని 30 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. నీట మునిగిన మరో బస్సులో ఉన్న 5 మందిని కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.