ఫ్లాష్- ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

AP CM YS Pics Sensational comments

0
87

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఫించన్ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛన్ పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం ప్రస్తుత రాజకీయాలపై ఈ వ్యాఖ్యలు చేశారు.

చెడి పోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నామని, రాజకీయ స్వార్థంతో ప్రతి విషయంలో అడ్డు తగులుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఈ ఏడాదిలోనైనా పేదలకు చేస్తున్న మంచికి అడ్డుతగలవద్దన్న జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మంచి చేయలేని పార్టీలు,నాయకులు విమర్శిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.