తమిళనాడు కూనూర్‌లో ఓ శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో సీనియర్, ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.