నకిలీ సర్టిఫికెట్ల కలకలం..నిందితుడి అరెస్ట్

Arrest of accused for forging fake certificates

0
140

నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారీ చేస్తున్న సురేష్ అనే నిందితుడిని గుంటూరు పరిధిలోని పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చేశారు. జెఎన్టీయూ- కాకినాడ లోగోలతో నిందితుడు నకిలీ పత్రాల తయారీ చేసిన వైనంతో వెలుగులోకి వచ్చాడు. అతని వద్ద నుండి 24 నకిలీ సర్టిఫికెట్లు, 36 హలో గ్రామ్ స్టిక్కర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ అమీర్ పేటలోని ప్రింట్ షాప్ సాయంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ స్నేహితుడు విదేశాలకు వెళ్లేందుకు సర్టిఫికేట్ అవసరం కాగా నకిలీ పత్రాల తయారీలో నిందితుడు పట్టుబడ్డాడు.