Flash News- డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్ కు షాక్..!

0
78

డ్రగ్స్‌ కేసులో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతన్ని14 ఎన్‌సీబీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కేసుని స్పెషల్‌ కోర్టుకు అప్పగించింది. అయితే శుక్రవారం కొనసాగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించి షాక్ ఇచ్చింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు.