బిగ్ బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో ఆసక్తికర మలుపు..టెన్షన్ లో షారూక్ కుటుంబం

0
77

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై కొద్ది సేపటి క్రితం ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్‌కు ఎన్‌సీబీ అధికారలు వచ్చి గాలింపులు చేపడుతున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్‌సీబీ టీమ్ చేరుకుంది.

సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్‌కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారట. ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కొడుకును షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం విశేషం.

 

ఈ కేసులో ఎన్సీబీ బలమైన వాదనలను వినిపించడంతో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించలేదన్నది నిపుణుల వాదన. గురువారం ఉదయం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్‌ను 19 రోజుల తర్వాత షారూఖ్ ఖాన్ కలిసేందుకు వచ్చాడు. కుమారుడితో మాట్లాడి తిరిగి వెళ్లిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన నివాసంలో దాడులు చేపట్టారు. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ సన్నిహితురాలయిన అనన్య పాండే నివాసంలో కూడా దాడులు చేపట్టి..గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది.