కేరళలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్.. శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీని వెనక ఆరెస్సెస్ హస్తం ఉందని ఆ పార్టీ ఆరోపించింది.
కాగా, 12 గంటల వ్యవధిలో భాజపా నేత ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజీత్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.