పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య..సూసైడ్ నోట్ కలకలం

0
106

ఏపీలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఆత్మహత్య కలకలం రేపుతోంది. కార్యాలయంలోని పై గదిలో ఉరి వేసుకుని రాము బలవన్మరనానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనతో ఏపీ ఉలిక్కిపడింది. అయితే తన చావుకు కారణం వీరే అంటూ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.

పలువురు బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారాంటూ సూసైడ్ నోట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పేర్కొన్నాడు.

‘‘నా చావుకు కారణం ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కనుముక్కల మహేష్ కారణం’’ అంటూ సూసైడ్ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు.
పలు ఆన్‌లైన్ వ్యాపారాల్లోనూ మోసానికి పాల్పడ్డారంటూ సూసైడ్ లెటర్‌లో పేర్కొనాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే రాము ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.