ఫ్లాష్..ఫ్లాష్- నైజీరియాలో కాల్పుల కలకలం..43 మంది మృతి

At least 43 people have been killed in a shooting in Nigeria

0
88

నైజీరియాలో జరిగిన కాల్పుల్లో సుమారు 43 మంది చనిపోయారు. ఆ దేశానికి వాయువ్య భాగంలో ఉన్న సొకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్​లో ఆ ఘటన జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

తొలుత 30మంది చనిపోగా..20 మందికి తీవ్రగాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు 200 మంది మార్కెట్​లోకి వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పుకొచ్చారు. వీరంతా మోటార్​ సైకిల్​పై వచ్చారని పేర్కొన్నారు. నైజీరియాలోని ఇలాంటి నేరాలు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.