ATM Robbery: పెళ్లి ఖర్చులకు ఏటీఎమ్‌ లూటీ..!

-

ATM Robbery by guard at bengaluru: ఆరు నెలల క్రితమే అతడికి ఓ ఏటీఎమ్‌ సెంటర్‌ వద్ద గార్డుగా ఉద్యోగం వచ్చింది.. అంతక ముందే.. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆ ప్రేమను పెళ్లి పీటల వద్ద వరకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అందుకు భారీగా డబ్బు అవసరం అయ్యింది. దీంతో తను పని చేస్తున్న ఏటీఎమ్‌కే కన్నం వేశాడు.. చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం సెంటర్‌ దగ్గర గార్డుగా దీపోంకర్‌ (23) ఆరు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. తను లవ్‌ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు, సిద్ధం కాగా, అందుకు భారీగా డబ్బు కావాల్సి వచ్చింది. దీంతో తాను పని చేస్తున్న ఏటీఎమ్‌ను లూటీ చేసేందుకు ప్రణాళిక వేశాడు. ఏటీఎమ్‌లో చోరీ (ATM Robbery) చేసేందుకు కొన్ని నెలలుగా పక్కా ప్లాన్‌ గీసుకొని, రంగంలోకి దిగాడు. గత నెల 17వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ప్లాన్‌ ప్రకారం రూ.20 లక్షలు దోచుకున్నాడు. ఇందుకోసం ఏటీఎంలో డబ్బు లోడ్‌ చేసే సిబ్బందితో స్నేహం పెంచుకున్నాడు. వారితో చనువు పెంచుకొని, వారి డైరీలో ఉన్న ఏటీఎమ్ క్యాసెట్ పాస్‌వర్డ్ తెలుసుకొని, దీపోంకర్‌ రూ. 20 లక్షలు దోచేశాడు. పైగా ఏటీఎమ్‌ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు.

ఏటీఎమ్‌లో నగదు పోయింది కానీ.. ఎటువంటి క్లూ లేదు, సీసీ కెమెరాలో కూడా ఎటువంటి దృశ్యాలు నమోదు కాకపోవటంపై మేనేజర్‌కు అనుమానం వచ్చింది. పైగా ఏటీఎంను ధ్వంసం చేయకుండా.. చాకచక్యంగా ఓపెన్‌ చేయటం, దొంగతనం జరిగిన నాటి నుంచి దీపోంకర్‌ విధులకు సరిగ్గా హాజరు కాకపోవటంతో దీపోంకర్‌ తీరుపై అనుమానం ఉన్నట్లు మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఐదు రోజులు గాలించిన పోలీసులకు.. దీపోంకర్‌ చిక్కాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయటంతో.. దొంగతనం చేసింది తానేనని దీపోంకర్‌ ఒప్పుకున్నాడు. అయితే దోచుకున్న డబ్బులో రూ. 5 లక్షలతో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చినట్లు వివరించాడు. నిందితుడి వద్ద మిగిలి ఉన్న రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకొని, దీపోంకర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...