దారుణం..మద్యం తాగించి మహిళపై గ్యాంగ్ రేప్

0
102
దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు బయటకు రావడానికే జంకుతున్నారు. కొంతమంది కామాంధుల అఘాయిత్యాలకు ఏమి తెలియని మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావి వరస, వివాహిత, అవివాహిత ఇలాంటి తేడాలు లేకుండా అందరిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 

 

ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళకు మాయమాటలు చెప్పి బలవతంగా మద్యం తాగించి నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.