సంగారెడ్డిలో దారుణం..వివాహితపై గ్యాంగ్ రేప్

0
195

దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు బయటకు రావడానికే జంకుతున్నారు. కొంతమంది కామాంధుల అఘాయిత్యాలకు ఏమి తెలియని మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావి వరస, వివాహిత, అవివాహిత ఇలాంటి తేడాలు లేకుండా అందరిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని తిరుమలగిరి నుంచి ఓ వివాహితను పలువురు జహీరాబాద్ లోని డిడిగి శివారులోకి తీసుకొచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మహిళకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.