హైదరాబాద్ లో దారుణం..టెన్త్ క్లాస్ విద్యార్థినిపై జిమ్ ట్రైనర్ అఘాయిత్యం

0
81

దేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెహ్రూన‌గ‌ర్‌కి చెందిన ఓ బాలిక ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వుతోంది. ఇంటి స‌మీపంలోని విశ్వ (23) జిమ్ ట్రైన‌ర్‌ కొంతకాలంగా ఆమెతో చ‌నువుగా ఉంటున్నాడు. గ‌త నెల 29న ఆమెను ఇంటి నుంచి తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అత్యాచారం, పొక్సో చట్టం కింద కేసు న‌మోదు చేశారు.