ఖమ్మం జిల్లాలో దారుణం..మైనర్ బాలికపై అత్యాచారయత్నం

0
78

దేశంలో క్రైమ్ రోజురోజుకు పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కారేపల్లి మండలం దుబ్బ తండాకు చెందిన మైనర్ బాలిక ఇంటర్ చదువుతుండగా..ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చింది కాగా సోమవారం తల్లిదండ్రులు పనులకు వెళ్ళగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు వంశీ, వీరేందర్, పుల్లారావులు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో నిందితులు పారిపోయినట్టు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.